Boy files complaint to get back bycycle in Siddipet: సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లిన ఓ కుర్రాడు (Boy) ఇంటికి వచ్చేసరికి అతని సైకిల్ పోయింది. దీంతో తన సైకిల్ (Bycycle ) వెతికి పెట్టమని సమీపంలోని పోలీసుల్ని ఆశ్రయించాడు. దాంతో ఎస్సై ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆపై 6వ తరగతి చదువుతున్న ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేయగా.. అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే…
సిద్దిపేట జిల్లా బెజ్జంకి (Bejjanki) మండల కేంద్రానికి చెందిన భువనగిరి సాత్విక్ (11).. సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లాడు. పండగ అనంతరం సాత్విక్ (Sathvik) తన ఇంటికి తిరిగి రాగా.. ఇంటి వద్ద పెట్టిన తన సైకిల్ కనిపించకుండా పోయింది. ఇంటి పరిసరాల్లో ఎక్కడ వెతికినా సైకిల్ ఆచూకీ తెలియరాలేదు. కుటుంబ సభ్యులను అడగ్గా.. తమకు తెలియదని చెప్పారు. దాంతో నిరాశకుగురైన సాత్విక్.. ఫిర్యాదు చేసేందుకు నేరుగా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
Also Read: Anasuya Bharadwaj Latest Pics: లంగాఓణీలో అనసూయ అదుర్స్.. నాభి అందాలను చూపిస్తూ..!!
బెజ్జంకి పోలీస్ స్టేషన్లో 6వ తరగతి చదువుతున్న సాత్విక్ చెప్పిన విషయం విన్న ఎస్సై ఆవుల తిరుపతి (SI Tirupati) ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఇక బాలుడి తండ్రికి ఫోన్ చేయగా.. అతడు చెప్పిన మాటలు విన్న ఎస్ఐకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. తన కొడుకు సాత్విక్ బయట తిరగొద్దని తానే ఇంట్లో సైకిల్ దాచిపెట్టినట్లు సాత్విక్ తండ్రి ఎస్ఐకి తెలిపాడు. అసలు విషయం బాలుడికి చెప్పి అతడిని ఆనందింపజేశారు. ఎలాంటి భయం, ఎవరి సహాయం లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి పోలిస్ స్టేషన్‌కు వచ్చిన సాత్విక్‌ను ఎస్సై తిరుపతి అభినందించారు.
Also Read: Covid Antibodies: రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నా తగ్గుతున్న యాంటీ బాడీలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link – https://bit.ly/3hDyh4G
Apple Link – https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
More Stories
Trending Video Of Gorilla Riding A Bycycle And Throwing It Goes Viral On Social Media
Red Hot Chili Peppers, Klinghoffer: “Amicizia di Frusciante inesistente da 10 anni”
10 cool classic vehicles from Green Acres